Breaking News

వరలక్ష్మి నీకు ఇదేం బుద్ధి..!

Published on Wed, 06/11/2025 - 14:19

మనోహరాబాద్‌(తూప్రాన్‌): వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని ఆభరణాలతో ఉడాయించిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ వివరాలు వెల్లడించారు. తూప్రాన్‌ మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన బాదనపురం పెంటయ్య(30) మండలంలోని వట్టూర్‌ గ్రామానికి చెందిన వరలక్ష్మి(30)తో సహజీవనం చేస్తున్నాడు. కాగా నిందితుడికి భార్యాపిల్లలు ఉన్నారు. నిందితుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై ఈ క్రమంలో లోన్లు సైతం తీసుకున్నాడు. అప్పులు ఎక్కువ అవ్వడంతో తీర్చేందుకు చోరీలు చేస్తున్నాడు. 

గత సంవత్సరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ పల్సర్‌ బైక్‌ను చోరీ చేసి ఆంధ్రాకు చెందిన నంబర్‌ ప్లేట్‌ అమర్చాడు.ఈ నెల 7న సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నె రామవ్వ పాములపర్తికి వెళ్లేందుకు గజ్వేల్‌ బస్టాండులో ఉంది. నిందితులు వరలక్ష్మి వృద్ధురాలికి మాయమాటలు చెప్పి పెంటయ్యతో కలిసి బైక్‌ౖపై తీసుకొని పర్కిబండ సమీపంలోని ఓ గుడిలోకి వెళ్లి మద్యం తాగారు. కాగా వృద్ధురాలు మత్తులోకి జారుకోగానే ఆమె ఒంటిపై ఉన్న తులం బంగారు నల్లపూసల తాడు, చెవికమ్మలు, 50 తులాల వెండి కడియాలు చోరీ చేశారు. వృద్ధురాలు అరవగా చంపుతామని బెదిరించి పరారయ్యారు. 

వెంటనే వృద్ధురాలు మనోహరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు  తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం దండుపల్లి వద్ద వాహనాల తనిఖీలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది గోవర్ధన్‌రావు, రాధాకృష్ణ, భిక్షపతిలను ఎస్పీ  అభినందించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు.

 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)