Breaking News

150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి

Published on Wed, 10/29/2025 - 05:27

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించి 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్‌ నిర్మాణంతో మహా రాష్ట్రలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు త్వరలో మహారాష్ట్రలో పర్యటించనున్న ట్టు ఆయన తెలిపారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై మంగళవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బరాజ్‌ నుంచి సుందిళ్ల బరాజ్‌కి గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎత్తిపోయాలనే ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను ఈ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమో దించారు.

తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించినా 80 టీఎంసీల నీళ్లను తరలించుకోవచ్చనే వాదన ను ఈ సమావేశంలో సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) అధికారులు తోసిపుచ్చారు. కనీసం 149 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మిస్తేనే 80 టీఎంసీలను గ్రావిటీతో సుందిళ్ల వరకు తరలించగలమని స్పష్టం చేశారు. దీంతో 150 మీటర్ల ఎత్తు లో తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రాణహిత ప్రాజెక్టు కింద గతంలో నిర్మించిన పనులను వినియోగంలోకి తెచ్చి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనల రూపకల్పన జరగాలన్నారు. సుందిళ్ల బరాజ్‌కు సత్వరం మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

కాళేశ్వరం మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్లదే..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థలదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ తేల్చిచెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ –2021 ప్రకారం 5 ఏళ్లలోపు దేశంలోని ఆనకట్టల భద్రతకు సంబంధించిన సమగ్ర మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉండగా, ఈ విషయంలో రాష్ట్రం వెనకబడిందని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ నెల 17న సీఎం రేవంత్‌కు లేఖ రాశారు.

రాష్ట్రంలోని 173 ఆనకట్టల భద్రతకి సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసేందుకు 15 నెలల సమయమే మిగిలి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు స్వయంగా సమీక్ష నిర్వహించాలని సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. దీంతో కేంద్రం నిర్దేశించిన గడువులోగా అన్ని ఆనకట్టల భద్రతకు సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. పురోగతి విషయంలో ఆనకట్టలవారీగా స్థితిగతుల నివేదిక రూపొందించాలని, నవంబర్‌ రెండోవారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)