తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం

Published on Thu, 05/09/2024 - 04:13

ఖమ్మం వన్‌టౌన్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో రైతులు అధైర్య పడొద్దని.. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కిసాన్‌ కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ పూర్తిచేసి.. ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్ల రుణమాఫీ చేశామనేది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో చెబుతామని తెలిపారు. కాగా, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగేలా పంటల బీమా పథ కాన్ని అమలు చేస్తూ, ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. ఇక విత్తన కంపెనీలతో ఇబ్బందులు లేకుండా రైతులకు విత్తనాలు అందేలా ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు.

 కాగా, ఆయిల్‌పామ్‌తో లాభాలు గడించే అవకాశమున్నందున రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఇక పంట నష్టపరిహారం సైతం త్వరలో అందిస్తామని, వచ్చే ఖరీఫ్‌ నుంచి పెంచిన ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తామని తుమ్మల తెలిపారు. కాగా, నల్లగొండలో ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజార్టీ ఇస్తామని అక్కడి నేతలు చెబుతున్నందున, ఆ మెజార్టీ దాటేలా ఖమ్మం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)