Breaking News

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1,601 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు 

Published on Fri, 02/03/2023 - 01:39

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌), 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల స్వీకరణ తదితర వివరాలతో ఈ నెల 15 లేదా ఆ తర్వాత పూర్తి స్థాయి నియామక ప్రకటనను సంస్థ వెబ్‌సైట్ల(www.tssouthernpower.com లేదా tssouthern-power.cgg.gov.in)) లో పొందుపరచనున్నారు.

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ(ఎలక్ట్రికల్‌) పోస్టులకు అర్హులు కానున్నారు. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మెన్‌ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు చేసి ఉండాలి. గతేడాది 1,000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్టు గుర్తించడంతో ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దుచేశారు. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు పోస్టుల సంఖ్యను 1,553కి పెంచి తాజాగా సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీ చేసింది.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)