Breaking News

విన్నపాలు వినవలె!

Published on Wed, 05/29/2024 - 04:48

సాక్షి, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఇవ్వటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 90 శాతాన్ని మించి పోయి పూర్వవైభవం కనిపిస్తోంది.. కానీ, అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావా ల్సిన మొత్తం విడుదల కాకపోవటంతో, పెరిగిన ఆక్యుపెన్సీ రేషియోకు తగ్గ ఆదాయం నమోదు కావటం లేదు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధి బకాయిలు ఏకంగా రూ.2 వేల కోట్లను దాటిపోయాయి.

గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా, దాని అమలు ఆగిపోయింది. ఇప్పుడు ఉద్యోగులకు సకా లంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ అధికారుల విన్నపాల్లో ఆయన దేనికి సానుకూలత వ్యక్తం చేస్తారోనన్న చర్చ ఇప్పుడు సంస్థలో విస్తృతంగా సాగుతోంది. 

నేడు సమీక్ష లేకుంటే... 
వాస్తవానికి మంగళవారం రోజునే సమావేశం ఉంటుందని చెప్పగా, ఆ రోజున వాయిదా వేసి బుధవారం ఉంటుందంటూ సమాచారం అందింది. జూన్‌ 2 రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున, సీఎం ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సమీక్ష ఉండకపోవచ్చునని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతు న్నారు. జూన్‌ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

రాజకీయంగా అది కూడా ఆయన బిజీగా ఉండేందుకు కారణం కానుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత సమీక్ష ఉండే అవకాశం ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. బుధవారం సమీక్ష జరగని పక్షంలో, వచ్చే పది రోజుల్లో ఉంటుందని అంటున్నారు. దీంతో, ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఓ నివేదిక సిద్ధం చేస్తున్నారు.

అధికారులు ఏం కోరనున్నారంటే 
⇒ మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి జారీ చేస్తున్న జీరో టికెట్ల ఆధారంగా ప్రతినెలా నిధులు రీయింబర్స్‌ చేయాలి. దాన్ని రూ.350 కోట్లకు పెంచాలి.  
⇒ మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ బాగా పెరిగినందున, 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలి. 
⇒ ప్రతిపాదిత కొత్త బస్సుల సంఖ్య దామాషా ప్రకారం.. పది వేల మంది ఉద్యోగులను రిక్రూట్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు కనీసం నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాలి. 

⇒ గతేడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తంలో ఇంకా రూ.వేయి కోట్లు బకాయి ఉంది. దాన్ని వెంటనే విడుదల చేయాలి 
⇒ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధికి సంబంధించిన రూ.2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయాలనే అంశాలను అందులో పొందుపరుస్తున్నట్టు తెలిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)