Breaking News

టావెల్స్‌ బస్సును ఢీకొట్టిన సూపర్‌ లగ్జరీ బస్సు

Published on Sun, 11/03/2024 - 05:03

కోదాడ రూరల్‌: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పరిధి­లోని కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్‌ వద్ద హైదరా­బాద్‌–­విజయవాడ జాతీయ రహ­దారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. హైద­రా­బాద్‌ నుంచి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు శుక్ర­వారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రయా­ణికు­లతో రాజమహేంద్రవరా­నికి బయల్దేరింది.

శనివారం తెల్లవారుజా­మున కట్టకమ్ము­గూడెం క్రాస్‌రోడ్‌ వద్ద హైవే పక్కన బస్సును నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టీజీఎస్‌ ఆర్టీసీకి చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు ఆగి ఉన్న ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి ఢీకొ­ట్టింది. దీంతో ట్రావెల్స్‌ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లి ఆగింది. రెండు బస్సుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పోలీ­సులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయప­డిన నవ్య, ఆదిత్య, తేజ, డేవిడ్‌లను కోదాడ­లోనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వెంక­టేశ్వరరావు, కె.మణి, దానియేలు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరా­బాద్‌కు తరలించారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)