Breaking News

త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఎలా జరుగుతోంది?

Published on Wed, 02/15/2023 - 04:02

రఘునాథపల్లి: వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు జనగామ జిల్లా రఘునాథపల్లి సబ్‌ డివిజన్‌ సెక్షన్‌ ఆఫీస్, ఈఆర్వో కార్యాలయం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు రాత్రివేళ పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం ‘చేను తడవాలంటే జాగారమే’శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.

వ్యవసాయానికి త్రీఫేజ్‌ సరఫరా ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులున్నాయా.. 33/11 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, వర్క్‌ కేటాయింపు రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. వినియోగదారులకు, రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ æఇంజనీర్‌ వేణుమాధవ్, డీఈ ఆపరేషన్‌ ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, డీఈ ఐటీ అనిల్‌కుమార్, ఏడీఈ మనోహర్‌రెడ్డి, ఎస్‌ఏవో జయరాజ్, ఏఏవో హన్మంత్‌నాయక్, ఏఈ రాహుల్‌ తదితరులున్నారు.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు