Breaking News

తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ

Published on Wed, 07/19/2023 - 21:12

సాక్షి, హైదరాబాద్‌: తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ పుస్తకం "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" అనే పుస్తకాన్ని ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం హై కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ బిఎన్‌లు కలిసి రచించారు.

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఇందులో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి ? దానికోసం మనం తెలుసుకోవాల్సిన అంశాలపై "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది.

ఈ సందర్భంగా జస్టిస్‌ బి విజయసేన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరమని, దీంతో ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏ ఒక్కరినో శక్తివంతం చేయకుండా వ్యవస్థ సమతుల్యంగా నడవాలి కాబట్టి ప్రతి ప్రొఫెషనల్‌, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత ఉండాలని సూచించారు.

తప్పుడు రిపోర్టింగ్‌, తప్పుడు సమాచారంతో బాధితులు మనోవేదనకు గురవుతున్నారని, ఈ ఫ్యాక్ట్‌ చెక్‌ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్ట్‌ చెక్‌ను ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థగా భావిస్తున్నానన్నారు. ఈ పుస్తకం పోలీసు, న్యాయస్థానాల వంటి వ్యవస్థల మధ్య, మధ్యవర్తులు అందుబాటులో ఉంటే, అది బాధితునికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె.స్టీవెన్‌సన్ మాట్లాడుతూ.. అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ? ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి ? తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే టూల్స్ గురించి, ఇమేజ్, టెక్ట్స్, వీడియో వెరిఫికేషన్ వంటి అంశాలపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారని చెప్పారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)