Breaking News

ఎంసెట్‌కు బయోమెట్రిక్‌ తప్పనిసరి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

Published on Tue, 05/09/2023 - 08:08

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్, వైద్య, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఎంసెట్‌–2023 ఈ నెల 10వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 10, 11 తేదీల్లో అగ్రి, మెడికల్‌ ఎంసెట్‌ జరుగుతుంది.

12 నుంచి 14 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ఉంటుంది. రెండు సెషన్లుగా ఉండే ఈ పరీక్ష, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఒక విడత, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకూ రెండో విడత జరుగుతుంది. 2 రాష్ట్రాల పరిధిలో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ 2,05,405 మంది, అగ్రి, మెడికల్‌ ఎంసెట్‌ 1,15,361 మంది రాస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా 104, ఆంధ్రప్రదేశ్‌లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే రోజుల్లో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావాలని ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌ తెలిపారు. పరీక్ష రాసేవారికి జేఎన్‌టీయూహెచ్‌ కొన్ని సూచనలు చేసింది. 

బయోమెట్రిక్‌ తప్పనిసరి..
► ఎంసెట్‌ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి. ఈ కారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కుంటే బయో మెట్రిక్‌ హాజరుకు ఇబ్బంది ఉండదు.  
► ఉదయం పూట ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యే వారు 7.30కే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యా హ్నం 3 గంటలకు జరిగే పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలి. ఒక్క నిమిషం దాటినా పరీక్షకు అనుమతించరు. 
► విద్యార్థులు బ్లాక్‌ లేదా బ్లూ పాయింట్‌ పెన్, హాల్‌ టికెట్, ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అప్లికేషన్‌ (రిజర్వేషన్‌ కేటగిరీ కుల ధ్రువీకరణ) పత్రాలతో మాత్రమే పరీక్ష హాలులోకి రావాల్సి ఉంటుంది.  
► కాలుక్యులేటర్లు, మేథమెటికల్, లాగ్‌ టేబుల్స్, పేజీలు, సెల్‌ఫోన్లు, రిస్ట్‌ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించరు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమస్యలొస్తే ఇన్విజిలేటర్‌ దృష్టికి తేవాలి. అవసరమైన పక్షంలో వేరే కంప్యూటర్‌ అందిస్తారు.  
► అభ్యర్థులు ఫొటో గుర్తింపు (జిరాక్స్‌ కాకుండా)తో పరీక్షకు హాజరవ్వాలి. కాలేజీ ఐడీ, ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్‌ ఐడీని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌పై, ఆన్‌లైన్‌ ఫైల్‌ చేసిన అప్లికేషన్‌పై ఇన్విజిలేటర్‌ ఎదురుగా సంతకం చేయాలి.
చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)