Breaking News

నాన్నా రాడు.. అమ్మ లేదు.. ‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన అలేఖ్య

Published on Fri, 05/12/2023 - 11:39

నల్గొండ: నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థిని కట్టెబోయిన అలేఖ్య పరీక్షలకు ముందు ఎన్నో ఇబ్బందులకు గురైంది. బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన  కట్టెబోయిన వెంకటయ్య, లక్షమ్మ దంపతులకు ఏకైక కూతురు అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియడంతో తండ్రి చాలా ఏళ్ల కిందటే వదిలి వెళ్లాడు. 

దీంతో తల్లి లక్ష్మమ్మ కూతురు అలేఖ్యను తీసుకుని తల్లిగారి ఊరు పెద్దవూర మండలంలోని ముసలమ్మ చెట్టుకు వచ్చి స్థిరపడింది. అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమనూరులోని వసతి గృహంలో ఉంటూ ఆదర్శ పాఠశాలలో చేరింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కూడా తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందింది.  ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు    రా సి 9.7 జీపీఏ సాధించింది.  

అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న ఆదర్శ పాఠశాల అధ్యాపకులు ఆర్థికంగా కొంత సహయ సహకారాలు అందించారు. పదో  తరగతి తర్వాత కూడా అలేఖ్య కూడా చదువుకు అవసరమైన సహకారం అందించడానికి అధ్యాపకులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్‌లో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది.  బైపీసీలో చేరి, నర్సింగ్‌ చేయాలని లక్ష్యమని తెలిపింది.

సాయం అందిచాలనుకునే వారు:
కట్టెబోయిన అలేఖ్య
యూనియన్‌ బ్యాంక్‌(పెద్దవూర బ్రాంచ్‌)
A/C NO: 194612120000001
IFSC CODE:UBIN 0819468

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)