Breaking News

Telangana: ఈనెల 30న టెన్త్‌ ఫలితాలు

Published on Mon, 04/28/2025 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 30వ తేదీన పదవ తర­గతి పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని టెన్త్‌ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వాస్తవానికి టెన్త్‌ మూ­ల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాల పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రిత­మే పూర్తయింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ«దీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతు­ల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధి­కా­రులు భావించారు.

ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చే వరకూ నిరీక్షించారు. ఇటీవల అధికారులు సీఎంను కలవ­గా, ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్ప­గించినట్టు తెలిసింది. ఈనెల 30న భట్టి సమ­యం ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఫలితా­లు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.  

మెమోల్లో మార్పులు 
టెన్త్‌ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పు­లు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న తరు­ణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గ్రేడింగ్‌ విధానంలో మెమోలు ఇచ్చేవాళ్లు. ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్‌తో పాటు, విద్యార్థి మార్కులు మోమోలో పొందుపరుస్తారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని ఆ ఆదేశాల్లో వెల్లడించారు.

ఇప్పటివర­కూ విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ మార్కు­లు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించడం కష్టం. ఇప్పుడీ విధానాన్ని మార్చడంతో గ్రేడ్స్‌తో పా­టు ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కులుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తివేసేందుకు కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)