Breaking News

తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారు..

Published on Mon, 07/19/2021 - 09:32

సాక్షి, నల్లగొండ రూరల్‌: తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తకెళ్లపల్లి రవీందర్‌రావు ఆరోపించారు. అందులో భాగంగానే నదీ జలాలపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు.శనివారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి , మిర్యాలగూడ ఎమ్మెల్యే బాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి , వైస్‌ చైర్మన్‌ అబ్బగోనిరమేష్‌గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య ఉందని, వ్యవసాయ ఆధారంగా జీవనం సాగుతున్న నల్లగొండకు కేంద్రం జారీ చేసిన కృష్ణా నీటి గెజిట్‌తో తీరని నష్టం జరుగుతుందన్నారు. వృథాగా పోయే గోదావరి నీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు , లిప్టులు , బ్యారేజిలను నిర్మించారన్నారు. ఆంధ్రాపాలకులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు  పంకజ్‌ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, సహదేవ్‌రెడ్డి, దొటి శ్రీనివాస్, ఖరీంపాష, దేప వెంకట్‌రెడ్డి, నాగార్జున, మధుసూదన్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పబ్బు సందీప్‌గౌడ్, సత్తయ్య గౌడ్, మల్లేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)