Breaking News

త్వరలో రంగంలోకి ‘ఆపద మిత్ర’లు

Published on Mon, 04/01/2024 - 02:01

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన ఆపద మిత్ర పథ కంలో భాగంగా తెలంగాణ అగ్నిమా పకశాఖ ఆధ్వర్యంలోనూ ‘ఆపద మిత్ర’లకు శిక్షణ ఇస్తు న్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) వై.నాగిరెడ్డి తెలిపారు. విపత్తుల వేళ సత్వర స్పందన కోసం స్థానికుల్లో కొందరిని వలంటీర్లుగా గుర్తించి వారికి ‘ఆపద మిత్ర’లుగా శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం వరంగల్‌లో 95 మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని.. వారికి తరగతి గది శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు. త్వరలోనే వారికి క్షేత్రస్థాయి శిక్షణ ప్రారంభిస్తామన్నారు.

అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా స్పందించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. చుట్టుపక్కల వారిని ఎలా అప్రమత్తం చేయాలన్న అంశాలపై ‘ఆపద మిత్ర’లు శిక్షణ పొందుతారని తెలిపారు. ఫైర్‌ సిబ్బంది మంటలార్పే సమయంలో సహాయకులుగా వ్యవహరిస్తారని వివరించారు. సాధారణ సమయాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికంగా వారి పరిధిలో అవగాహన సైతం కల్పిస్తారన్నారు.

మరోవైపు ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఫైర్‌ సర్వీస్‌ వారంగా నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. వారంపాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయాల్లో ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై ఫైర్‌ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)