Breaking News

నేను.. ఆ వివాహిత 2025 జూన్‌ నుంచి రిలేషన్‌లో ఉన్నాం..!

Published on Tue, 07/21/2026 - 09:20

సాక్షి, హైదరాబాద్‌: వివాహిత అయిన సహ ట్రైనీని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్‌ ఎం.ఉదయ్‌ కృష్ణారెడ్డి వ్యవహారంలో సోమవారం ఆద్యంతం హైడ్రామా నడిచింది. మోతీనగర్‌లో ఉండే తన సోదరుడి ఇంట్లో ఈయన స్పృహ లేకుండా పడిపోయారు. పక్కనే మద్యం సీసాలతోపాటు సగం ఖాళీ అయిన ఓ శానిటైజర్‌ బాటిల్, సూ­సైడ్‌ నోట్‌ ఉండటంతో కుటుంబీకులు ఆత్మహత్యాయత్నంగా భావించి ఆస్పత్రికి తరలించారు. 

స్టమక్‌ వాష్‌తోపా­టు ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు ఆయన రక్తనమూనాలు సేకరించి పరీక్షించారు. వీటిలో ఎలాంటి విష పదార్థపు ఆనవా­ళ్లు లేవని తేలింది. దీంతో ఆ సూసైడ్‌ నోట్‌ ఎందుకు రాశా­రు? అందులో బాధితురాలు, ఆమె భర్తతో పాటు మరికొంద­రు ట్రైనీ ఐపీఎస్‌ల పేర్లు ఎందుకు చేర్చారనే కోణంలో పోలీసు­లు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణారెడ్డి తనపై సానుభూతి కో­సం ఇంతటి హైడ్రామా నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.   

కృష్ణారెడ్డి సస్పెన్షన్‌: హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌­పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో (ఎస్‌వీపీఎన్‌ పీఏ) శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్‌ గత గురువారమే కృష్ణారెడ్డి­పై తమ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ అంశంపై విచారణ చేపట్టే బాధ్యతల్ని ఎన్‌పీఏ ప్రివిలేజెస్‌ కమిటీకి అప్పగించారు. అకాడమీలోని సీసీ కెమెరాల్లో నమోదై­న దృశ్యాలు, బాధితురాలి వాంగ్మూలా­న్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉ­న్నా­యని తేల్చింది. దీంతో కృష్ణారెడ్డిని ఎన్‌పీఏ నుంచి శుక్రవారం సస్పెండ్‌ చేశారు.

దీంతో ఆయన అక్కడ నుంచి మోతీనగర్‌లో ఉన్న తన సోదరుడు ప్రణయ్‌ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేస్తూ ఎనిమిది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి తన వాట్సాప్‌ స్టేటస్, ఇన్‌స్ట్రాగామ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై ప్రచారం జరుగుతున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని తన స్నేహితుడైన లాయర్‌ ఫ్లాట్‌కు ఆదివారం రాత్రి వెళ్లారు. అనంతరం సోదరుడి ఇంటికి వెళ్లిన కృష్ణారెడ్డి రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ రాశారు. ఆపై మద్యం మత్తులో స్పృహ తప్పారు.   

కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే... 
‘నేను.. ఆ వివాహిత 2025 జూన్‌నుంచి రిలేషన్‌లో ఉన్నాం. ఆమెకు వివాహమైన తర్వాత కూడా మా మధ్య శారీరకంగా, భావోద్వేగపరంగా సంబంధం కొనసాగింది. దీనికి సంబంధించిన ఆధారంగా నా ఐఫోన్‌లో వీడియోలు రికార్డు చేశాను. వాటిని ఆమె భర్తకు పంపాను. ఆమె స్నేహితులు నాపై ఫిర్యాదు చేసేలా రెచ్చగొట్టారు. నా ఆత్మహత్యకు ఆమె, ఆమె భర్తతోపాటు ఇద్దరు స్నేహితులు కారణం. వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)