ఢిల్లీ–సికింద్రాబాద్‌ రైలు టికెట్‌ రూ.10,200!

Published on Sun, 12/07/2025 - 04:59

సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమా న సర్వీసుల రద్దు నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా రైళ్లలో ప్రయాణిస్తుండగా వారి అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పనుల నిమిత్తం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఇండిగో ఫ్లైట్‌లో తిరిగి హైదరాబాద్‌కు టికెట్‌ బుక్‌ చేసుకోగా ఆ సర్వీసు రద్దయింది. దీంతో చెన్నై వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్‌ ఏసీ టికెట్‌ బుక్‌ చేసుకోగా అది కన్‌ఫం కాలేదు. టీసీని బతిమిలాడగా సాధారణ చార్జీతోపాటు తనకు కొంత ముట్టజెప్పాలని ప్రయాణికుడిని కోరినట్లు తెలిసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీసీకి ఆ వ్యక్తి మొత్తం రూ. 10,200 నగదు చెల్లించాడు. ఇండిగో విమానాల రద్దుతో ఢిల్లీ–సికింద్రాబాద్‌ రైళ్లన్నీ కిటకిటలాడుతుండటంతో ప్రయాణికుల వెయిటింగ్‌ లిస్టే వందల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఏసీ కన్ఫర్మేషన్‌ కావడం కష్టమంటూ కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఓ ప్రయాణికుడు నిలబడి వెళ్లేందుకు అనుమతించినందుకు టీసీ రూ. 5 వేలు వసూలు చేశాడని సమాచారం.


    థర్డ్‌ ఏసీ వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికుడి నుంచి దండుకున్న టీసీ
    ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులను దోచుకుంటున్న వైనం

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)