మెడపై ఆ ఒక్క గాటు.. కిలాడీ భార్య మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ!

Published on Wed, 07/01/2026 - 21:04

సాక్షి,నిజామాబాద్‌: పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాల చిచ్చు రేగుతోంది. క్షణిక సుఖాల కోసం, ప్రియుడి మోజులో పడి కొందరు మహిళలు కంటిపాపల్లా చూసుకోవాల్సిన భర్తలను కడతేరుస్తున్నారు. శృంగానికి అడ్డొస్తున్నారని కన్నప్రేమను కూడా మర్చిపోయి.. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలనే గొంతు పిసికి చంపేస్తున్నారు.

ఇటీవల వెలుగులోకి వస్తున్న వరుస ఉదంతాలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని కళ్ళకు కడుతున్నాయి.తాజాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ప్రియుడితో కలిసి హ్యాపీగా ఉండాలనుకున్న ఒక భార్య.. అర్ధరాత్రి వేళ భర్త మహిపాల్‌ను ఉరివేసి చంపేసింది. తెల్లవారాక ఏమీ తెలియనట్టు ‘గుండెపోటుతో చనిపోయాడంటూ’ ఊరంతా నమ్మించేలా హైడ్రామా ఆడింది. 

కానీ, పాపం పండి మెడపై ఉన్న ఉరితాడు ‘గాటు’ను గ్రామస్తులు గమనించడంతో అసలు నిజం బయటపడింది. ఇలాంటి ‘గుండెపోటు’ స్క్రీన్‌ప్లేలు ఈ మధ్యకాలంలో చాలా క్రైమ్ స్టోరీల్లో కామన్ అయిపోయాయి.కాబోయే భర్తలపై కూడా కక్ష!పెళ్లి ఇష్టం లేకనో, లేదా ప్రియుడితోనే జీవితం పంచుకోవాలనే మొండి పట్టుదలతోనో.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొందరు యువతులు కాబోయే భర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సియా అగర్వాల్’ ఉదంతమే దీనికి పెద్ద ఉదాహరణ. పూణెకు చెందిన కోటీశ్వరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్‌తో నిశ్చితార్థం జరిగిన సియాకు, అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో రహస్య సంబంధం ఉంది.పెళ్లి ఇష్టం లేక, అలాగని నిశ్చితార్థం రద్దు చేసుకుంటే పరువు పోతుందని భావించిన ఆమె.. పెళ్లి షాపింగ్ నెపంతో కేతన్ నుండి కోటి రూపాయలు తీసుకుని ప్రియుడికి ఇచ్చింది .ఆ తర్వాత బర్త్‌డే సర్‌ప్రైజ్ అంటూ కేతన్‌ను లోహగఢ్ కోటపైకి ట్రెకింగ్‌కు తీసుకెళ్లి, ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రియుడితో కలిసి లోయలోకి నెట్టి అత్యంత దారుణంగా హతమార్చింది.మొదట దీనిని ప్రమాదంగా నమ్మించినా, వారి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడి, నిందితులిద్దరూ అరెస్టయ్యారు

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)