Breaking News

సర్పంచ్‌ విజయోత్సవాల నడుమ దారుణం..

Published on Sat, 12/20/2025 - 09:33

మహబూబ్‌నగర్‌ జిల్లా: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన  ఓ యువతి (22) ఇంటర్‌ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్‌ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. 

అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.  

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ 
ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్‌ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్‌ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)