Breaking News

ఈఎస్ఐ ఆస్పత్రిలో ఘోరం.. కార్మికుడి దుర్మరణం

Published on Mon, 11/24/2025 - 16:55

సాక్షి, హైదరాబాద్‌: సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాల బోధనాసుపత్రిలో ప్రమాదవశాత్తు సెంట్రింగ్‌ లిఫ్ట్‌ వైరు తెగి కిందపడిపోవడంతో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రి భవనానికి ఉన్న గ్రానైట్స్‌ను తొలగించి కిందకు తీసుకువచ్చే క్రమంలో సస్పెండెడ్‌ ప్లాట్‌ఫాం (సెంట్రింగ్‌ లిఫ్ట్‌) వైరు తెగిపోయింది.

సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం..ఆసుపత్రి నిర్మాణ సమయంలో భవనం చుట్టు గ్రానైట్‌ రాళ్లు అమర్చారు. నాణ్యత లోపించిన కారణంగా ఇటీవల ఆ రాళ్లు ఒక్కొక్కటిగా ఊడి కింద పడుతున్నాయి. దీంతో పాత గ్రానైట్‌ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. టెండర్‌ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ దాదాపు 20 రోజుల నుండి కార్మికుల చేత పనులు చేయిస్తున్నాడు. 

ఇందులో భాగంగా తొలగించిన గ్రానైట్‌ను సస్పెండెడ్‌ ప్లాట్‌ ఫాంపై పెట్టి కిందకు దింపుతున్న సమయంలో వైరు తెగి ఆరవ అంతస్తు నుంచి ప్లాట్‌ ఫాం ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న భానుచందర్‌ (24) మృతి చెందాడు. మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రఘుపతి, మోహన్‌ పరిస్థితి విషమంగా ఉండగా మల్లేశ్‌, మైసయ్య గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతుడు భానుచందర్‌ ఒంగోలుకు చెందిన వాడు కాగా అతడి బావ, విజయవాడకు చెందిన నాగరాజు కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నాడు. ప్లాట్‌ ఫాంపై ఎక్కువ మోతాదులో గ్రానైట్స్‌ పెట్టిన కారణంగా వైరు తెగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. వివిధ కోణాలలో కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా తీవ్ర గాయాలపాలైన భానుచందర్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేశామని డీన్‌ శిరీష్‌ కుమార్‌ తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)