Breaking News

మేడారం జాతరలో విషాదం

Published on Wed, 01/28/2026 - 17:06

ములుగు: మేడారంలో విషాదం చోటు చేసుకుంది. జంపన్నవాగులో పడి భక్తుడు మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అంతకు ముందు భూపాలపల్లి జిల్లాలో మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడిన భక్తుల్ని ఆస్పత్రికి తరలించారు.

భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామం సమీపంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. మేడారం  సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లేందుకు ఒక ట్రాక్టర్‌లో 25 మందికి పైగా భక్తులు ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడటంతో తల్లి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.

మెదారం జాతరకు ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది మంది భక్తులు తరలివెళ్తారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాక్టర్‌లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణించరాదని అధికారులు సూచించారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు