Breaking News

భార్య వివాహేతర సంబంధం.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య

Published on Wed, 05/07/2025 - 07:09

కొండాపూర్‌ (సంగారెడ్డి): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అవమానంగా భావించిన భర్త, తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచి్చన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి విగతజీవిగా కనిపించాడు. 

ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండల పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటేశ్‌ కథనం ప్రకారం... కొండాపూర్‌ మండలం గారకుర్తికి చెందిన సుభాష్‌.. భార్య మంజుల, కుమారుడు మరియన్‌ (13), కూతురు ఆరాధ్య (9)తో కలిసి మల్కాపూర్‌లోని సా యినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుభాష్‌ సదాశివపేట మండలం ఆత్మకూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. 

కొద్ది రోజులుగా భార్య మంజుల ప్రవర్తనలో మార్పు రావడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంజుల 5 రోజుల కిందట ఎవరికీ చెప్ప కుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భావించిన సుభాష్‌ అవమానభారం భరించలేకపోయాడని, దీంతో పిల్లకు ఉరి వేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.  సుమారు 5 రోజుల కిందటే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలం వద్ద 4 పేజీల సూసైడ్‌ నోట్‌ లభ్యమైందని పోలీసులు తెలిపారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)