రక్షాబంధన్‌లో చిక్కుకున్న ట్రాఫిక్‌

Published on Sun, 08/10/2025 - 08:38

లక్డీకాపూల్‌: గ్రేటర్‌ నగరంలో శనివారం ట్రాఫిక్‌ రక్షా బంధన్‌లో చిక్కుకుంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి సతమతమైంది. రాఖీ పండుగ, వీకెండ్‌ కావడంతో నగరవాసులతో రహదారులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది. రాఖీ పౌర్ణమి రద్దీ కారణంగా ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడగా.. వ్యక్తిగత వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

నగర శివార్లలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఫలితంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుగా నిలిచి, ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి నెలకొంది. ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ వద్ద ట్రాఫిక్‌ దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోయారు.

 ఊహించని ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు మరీ ముఖ్యంగా రాఖీ కట్టేందుకు బయలుదేరిన మహిళలు అవస్థలకు గురయ్యారు. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం రూట్‌ ఇరువైపులా, మియాపూర్‌ నుంచి లక్డీకాపూల్‌ రహదారి ఇరువైపుల, కొంపల్లి వైపు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో స్తంభించిపోయాయి. బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. నగరంలో ఎక్కడ చూసినా బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ తప్పని పరిస్థితి నెలకొంది. ఊహించని పరిణామంతో నగర పోలీసులు సైతం ట్రాఫిక్‌ను చక్కదిద్దే క్రమంలో సతమతమయ్యారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)