Breaking News

కేసీఆర్‌ దీక్ష... ఓ నాటకం

Published on Sat, 11/29/2025 - 02:01

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధ న పేరుతో నాడు కేసీఆర్‌ చేసిన దీక్ష ఒక నాటకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించా రు. ఇప్పుడు బీఆర్‌ ఎస్‌ ఉనికిని చాటుకు నేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో దీక్షా దివస్‌ పేరుతో ఆ నాటకాన్ని రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహేశ్‌ గౌడ్‌ శుక్ర వారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజున కేసీఆర్‌ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందన్నారు. సోనియా చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని, అమర వీరులకు నివా ళులర్పించాలని చెప్పారు.

అసలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబసభ్యులు కానీ, దూరపు బంధువులు కానీ ఎవరైనా ప్రాణా లు కోల్పో యారా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా దీక్షా దివస్‌లు మాను కోవాలని బీఆర్‌ఎస్‌కు హితవు పలికారు. ‘ఎవరు తెలంగాణ ఇస్తే.. ఎవరు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర ఉందన్నది వాస్తవం. పులి నోటిలో తల పెట్టి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చా డన్నది మాత్రం అవాస్తవం. కేవలం ఆయన వల్లనే తెలంగాణ రాలేదు’ అని అన్నారు.

అది అటకెక్కలేదు..: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ముగిసిపోలేదని, దాని కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటామని మహేశ్‌ గౌడ్‌ చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెద్దఎత్తున తగ్గలేదని, కేవలం 0.5 శాతం మాత్రమే తేడా వచ్చిందన్నారు. దీనిపై త్వరలోనే ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు, అయితే, బీసీ సంఘాలు గాంధీభవన్‌ వద్ద ధర్నాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.

‘మీరు వెళ్లాల్సింది బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగిలిన బీజేపీ నేతల ఇళ్లకు. అలాగే, పైకి మద్దతిచ్చి లోపల అడ్డుతగులుతున్న కేటీఆర్, హరీశ్‌రావుల ఇళ్లకు. కిషన్‌రెడ్డి ఇంటి తలుపులు తట్టండి’ అని బీసీ సంఘాలనుద్దేశించి మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశించి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్‌ నేత చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని అన్నారు. అయితే, కోమటిరెడ్డిని కలిసి వివరణ ఇచ్చినట్లు కైలాశ్‌ తనకు చెప్పా రన్నారు. ఎంఐఎం విషయంలో బీజేపీ వ్యాఖ్యలు ఎప్పుడూ ఉండేవేనని, రోజుకు రెండుసార్లు ఎంఐఎంను, ఒవైసీలను తలుచుకోనిదే ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)