Breaking News

‘జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే.. మంచి మెజారిటీతో గెలుస్తాం’

Published on Sun, 10/26/2025 - 17:23

ఢిల్లీ:  తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలో  గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టితో గెలుపు సొంతం చేసుకుంటామన్నారు. ‘ జూబ్లిహిల్స్ లో 46 వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 

రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ అన్ని గమనిస్తుంది. అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నాం. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయం. ఎవరైనా, ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం. గోడలకు చెవులు ఉండే సమయం. జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది ఎమ్మెల్యేలకు డిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డిసిసి బాధ్యతలు తీసుకోవడం మంచిది. ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు డబుల్ పోస్టులుగా చూడం. 

కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే  అడ్డంకి ఉండదు. ఉన్నపళంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరు. నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేస్తారు. కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలి. మెట్రో ఫేస్ టూకు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు. కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా?,’ అని ప్రశ్నించారు. 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)