రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ చిక్కిన మణిహారిక

Published on Wed, 09/10/2025 - 10:02

మణికొండ (హైదరాబాద్‌): ఓపెన్‌ ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ ధ్రువపత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఓ అధికారిణి ఏసీబీ వలకు చిక్కారు. రూ.5 లక్షలు డిమాండ్‌ చేసి రూ. 4 లక్షలు తీసుకుంటూ మంగళవారం రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్‌పీ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో టీపీవోగా పనిచేస్తున్న మణిహారిక మంచిరేవులలోని వినోద్‌కు చెందిన ఓపెన్‌ ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ ఇచ్చేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు. 

అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 4 లక్షలకు బేరం కుదిరింది. ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తే ఉచితంగా చేయాల్సిన పనికి లంచం డిమాండ్‌ చేయటంతో వినోద్‌ తమను వారం రోజుల క్రితం సంప్రదించాడని శ్రీధర్‌ తెలిపారు. తమ సూచన మేరకు తను ఇస్తానన్న డబ్బును మంగళవారం నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి ఆమెకు ఇచ్చాడు. 

వెంటనే రంగంలోకి దిగి డబ్బును స్వా«దీనం చేసుకుని మణిహారికను అరెస్టు చేశామన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధి అలకాపూర్‌ టౌన్‌షిప్‌లోని ఆమె నివాసంలోనూ తనిఖీలు చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరు లంచం డిమాండ్‌ చేసినా తమ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)