Breaking News

టమాటా పడిపోయే..

Published on Sun, 01/26/2025 - 08:36

సాక్షి, హైదరాబాద్‌: టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. మునుపెన్నడూలేని రీతిలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. శివార్లలోని రైతులు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో తెంపకుండా తోటల్లోనే వదిలేసేందుకు మొగ్గు చూపుతుండగా.. కొందరు మాత్రం మార్కెట్‌కు తెచి్చనా ధరలు రాకపోవడంతో రోడ్లపై పారబోస్తున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో నగర మార్కెట్‌లో కిలో రూ. 15 ఉన్న టమాటా ప్రస్తుతం కిలో రూ. రూ.10కి పడిపొయింది. 

మార్కెట్లకు దిగుబడులు పోటెత్తడంతో సామాన్యులకు మాత్రం టమాటాలు అందుబాటులోకి వచ్చా యి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా పెరగడంతో ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్‌పల్లి, మాదన్నపేట, ఎల్‌బీనగర్‌ మార్కెట్లలో టమాటా ధరలు తగ్గాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో టమాటా రూ.3–8 ఉండగా రిటైల్‌ మార్కెట్‌లో ధర కిలో 7–10 పలుకుతోంది. 

డిమాండ్‌కు తగిన సరఫరా 
నగరానికి నిత్యం దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్‌ ఉంది.  ప్రస్తుతం మార్కెట్‌లకు 150 లారీల మేర దిగుమతులు వస్తున్నాయి.దీంతో నగర డిమాండ్‌ కంటే 30 లారీల టమాటా ఎక్కువగా దిగుమతి అవడంతో ధరలు విపరీతంగా పడిపోయాయి. తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రోజురోజుకూ దిగుమతులు పెరుగుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 30 నుంచి 40 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 90–120 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. ఈ నెల చివరి వరకు దిగుమతులు ఇలాగే ఉంటాయని, ఫిబ్రవరి రెండో వారం నుంచి దిగుమతులు తగ్గుతాయని హోల్‌సేల్‌ వ్యాపారులు అంటున్నారు. దిగుమతులు తగ్గితే ధరలు పెరిగే అవకాశముంది.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)