Breaking News

World Dosa Day: స్విగ్గీలో 29 మిలియన్‌ దోసెలు ఆర్డర్‌

Published on Fri, 03/01/2024 - 12:00

సాక్షి, హైదరాబాద్: అల్పాహారంలో దోసెదే అగ్రస్థానం అనేది ప్రపంచ దోస దినోత్సవ నేపథ్యంలో మరోసారి వెల్లడైంది. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ పార్టనర్‌ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడింంది. ఏటా మార్చి 3వ తేదీన దోసె దినోత్సవం సందర్భంగా స్విగ్గీ ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 లోపు ఏకంగా 29 మిలియన్ల దోసెలు డెలివరీ చేసినట్టు తెలిపింది.

దేశవ్యాప్తంగా బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో నిమిషానికి సగటున 122 దోసెలు ఆర్డర్‌ అయ్యా యి. ఇందులో బెంగళూరు టాప్‌లో ఉండగా..  తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్‌కు ఇష్టమైన స్నా క్‌–టైమ్‌ డిష్‌గా దోసె మరోసారి స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్‌కు చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో 447 ప్లేట్ల దోసెలు ఆర్డర్‌ చేసి.. దేశంలోనే  ఛాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు పరాఠాలను ఎక్కువ ఇష్టపడే చండీగఢ్‌ వాసులు సైతం తమ ఇష్టమైన వంటకంగా దోసెను స్వీకరించడం విశేషం.

రంజాన్, క్రికెట్‌ ప్రపంచకప్, ఐపీఎల్‌ సమయాల్లో అత్యధికంగా ఆర్డర్లు నమోదైన రెండో వంటకంగానూ.. నవరాత్రి సీజన్‌లో టాప్‌గా దోసె నిలిచింది. వీటిల్లో క్లాసిక్‌ మసాల దోసె అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ప్లె యిన్, సెట్, ఉల్లిపాయ, బటర్‌ మసాలా ఉన్నాయి. చాక్లెట్, పావ్‌ బాజీ నూడుల్స్‌ పాలక్, షెజ్వాన్‌ చాప్‌సూయ్‌ స్పెషల్, దిల్ ఖుష్ దోసెలను ప్రజలు ఆస్వాదించారు.

          

#

Tags : 1

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)