Breaking News

టైగర్‌కి ఈ టెంపర్‌మెంట్‌ ఏంటి?

Published on Tue, 01/07/2025 - 01:13

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా పెద్ద పులులు జనసంచారానికి ఆమడదూరంలో ఉంటూ అడవుల్లోనే సంచరిస్తుంటాయి. కానీ మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా విరూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలోని రాజూరా తాలూకాలో రెండు రోజుల కిందట అధికారులు బంధించిన ఓ పులి  మాత్రం భిన్నంగా కొన్ని రోజులపాటు అసాధారణ రీతిలో ప్రవర్తించింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్ల వెంబడి, జనావాసాలు, వ్యవసాయ భూముల వద్ద తచ్చాడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో ఆ పులిని బంధించిన అధికారులు దాని ప్రవర్తనకు గల కారణాలు ఏమిటో కనిపెట్టే పనిలో పడ్డారు.

పులి నుంచి పలు నమూనాలు సేకరించి వాటిని హైదరాబాద్‌లోని సీసీఎంబీతోపాటు బెంగళూరులోని మరో ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపారు. అలాగే మరిన్ని పరీక్షలు చేపట్టేందుకు వీలుగా దాన్ని చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ (టీటీసీ)కు తరలించారు. ఈ అంశంపై స్పష్టత వచ్చాక తెలంగాణ అటవీ అధికారులతో వివరాలు పంచుకుంటామని చెబుతున్నారు.

మనుషులపై దాడి ఆ పులి పనేనా?
మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల ఓ పులి పలువురిని హతమార్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసింది. అలాగే మహారాష్ట్ర సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లోనూ పలువురిని చంపింది. పత్తి ఏరివేత సీజన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలు ఇరు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుబడిన పులి అదేనా అని నిర్ధారించుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి నేపథ్యం ఏమిటో, అది ఎక్కడిదో తెలుసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఆ పులి ప్రవర్తన తెలుసుకోవడం కష్టమే.. 
పులుల సహజ స్వభావాన్ని బట్టి చూస్తే వాటికి మనుషుల పొడ గిట్టదు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయాందోళనకు గురవుతాడో అంతకంటే ఎక్కువగా పులి భయానికి గురవుతుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న పులులను గమనిస్తే అవి అక్కడ కూడా మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పులులు ఇక్కడకు వచ్చాక కూడా ఆ అలవాటును మానుకోలేక పోతున్నట్లు అంచనా వేస్తున్నాం. పులుల కదలికలు ఎలా ఉంటాయో కచ్చితంగా చెప్పలేం. చంద్రాపూర్‌లో బంధించిన పులి నుంచి సేకరించిన నమూనాలతో వాటి అసాధారణ ప్రవర్తన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే.
– ఎ.శంకరన్, వైల్డ్‌లైఫ్‌ ఓఎస్‌డీ, తెలంగాణ అటవీశాఖ 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)