Breaking News

ఓజీ.. ఏ క్యా జీ!

Published on Sun, 09/28/2025 - 03:52

సండే కదా.. ఓజీ సినిమాకి పోదామని అరవింద్‌ ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేద్దామనుకున్నాడు. తీరా చూసి నోరెళ్లబెట్టాడు. అంతకు రెండ్రోజుల క్రితమే ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపును హైకోర్టు కొట్టేసిందని విన్న అతనికి ఆ ధరలు చూస్తే ఏమీ అర్థం కాలేదు. నిజంగానే హైకోర్టు తగ్గింపు ఉత్తర్వులిచ్చిందా? లేక థియేటర్లు అమలు చేయడం లేదా? అనే డైలమాలో పడ్డాడు.  

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన ఓజీ టికెట్ల ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు శుక్రవారం కొట్టివేసినా, పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారు. శనివారం టికెట్ల బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో ప్రయతి్నస్తే పెంచిన ధరలే కనిపించాయని పలువురు వాపోయారు. హైదరాబాద్, కరీంనగర్‌ తదితర జిల్లాల్లోని థియేటర్లలో ఈ వ్యత్యాసం కనిపించిందని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీ వరకు ఓజీ సినిమా టికెట్‌ ధరలు పెంచుతూ, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిష¯న్‌ దాఖలు చేశారు.

ఈ పిటిష¯న్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. టికెట్‌ ధరల పెంపు మెమోను నిలిపివేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయగా, విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. 26న విచారణ చేపట్టాలని సింగిల్‌ జడ్జిని కోరింది. ‘ఓజీ’చిత్రానికి ఎలాంటి ఉపశమన ఆదేశాలు జారీ చేయలేమని శుక్రవారం విచారణ సందర్భంగా సింగిల్‌ జడ్జి స్పష్టం చేశారు. ఈ నెల 24 ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ.. అక్టోబర్‌ 9కి విచారణ వాయిదా వేశారు. అయినా పెంచిన ధరలనే థియేటర్లు వసూలు చేస్తున్నాయి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తాం..
ఓజీ చిత్ర టికెట్‌ ధరల పెంపు మెమో­ను ప్రభుత్వం నిలిపివేసినా సోషల్‌ మీడియాలో తీర్పునకు వక్రభాష్యం చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా టికెట్‌ ధరలను తగ్గించడం లేదు. తప్పుడు సందేశాలు, పెంచిన టికెట్‌ ధరలు వసూలు చేయడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తాం. – బర్ల మల్లేశ్, న్యాయవాది 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)