Breaking News

రైలు దిగబోయి పట్టాలపై పడి..

Published on Tue, 01/20/2026 - 08:48

మిర్యాలగూడ అర్బన్‌: కదులుతున్న రైల్లో నుంచి దిగేందుకు ప్రయత్నించిన టికెట్‌ కలెక్టర్‌ (టీసీ) ప్రమాదవశాత్తు రైలు కింద పడి రెండు కాళ్లు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం జరిగింది. 

రైల్వే పోలీసులు వివరాలు తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన బి.శ్యామ్‌కుమార్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో టికెట్‌ కలెక్టర్‌ (టీసీ)గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం విధులు ముగించుకుని పని నిమిత్తం నల్లగొండకు రైలులో బయల్దేరాడు. కానీ, నల్లగొండ రైల్వే స్టేషన్‌లో రైలు దిగలేదు.

రైలు మిర్యాలగూడ మీదుగా దామచర్ల మండలంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో కొద్దిగా నెమ్మదించడంతో అతడు రైల్లో నుంచి కిందకు దిగబోయాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కదులుతున్న రైలు కింద పడిపోయాడు. దీంతో అతడి రెండు కాళ్లు పూర్తిగా తెగిపడ్డాయి. 

స్థానికులు గుర్తించి వెంటనే అతడిని ఆటోలో స్థానిక హెల్త్‌ సబ్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)