Breaking News

అక్క పెళ్లికి వచ్చి..

Published on Tue, 11/04/2025 - 08:44

తల్లి అంటే ఆ అక్కాచెల్లెళ్లకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. రెండో కూతురు తనూష చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ప్రకృతి చిత్రాలను గీయడం అలవాటు చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. మే 10వ తేదీ మదర్స్‌డే సందర్భంగా తనూష తల్లి అంబిక ముఖ చిత్రాన్ని గీసింది. బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటో తీస్తే ఎలా వస్తోందో అలాగే తల్లి ఫొటోను గీసి అందరినీ అబ్బుర పర్చింది. అక్క పెళ్లిలో ఆకాశమే హద్దుగా..అప్యాయతే ముద్దుగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఆ ముగ్గురూ పెళ్లిలో చేసిన నృత్యాలు, సందడి చేసిన వీడియోలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు.   

తాండూరు, తాండూరు టౌన్‌: యాలాల మండలం పేర్కంపల్లికి  చెందిన అంబిక– ఎల్లయ్యగౌడ్‌ దంపతులకు అనూష, తనూష, సాయిప్రియ, నందినిలతోపాటు మురళీకృష్ణాగౌడ్‌ అనే కుమారుడు ఉన్నారు. ఐదుగురిని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో కొన్నేళ్ల క్రితం ఆ కుటుంబం తాండూరుకు వచ్చింది. బస్వణ్ణ కట్ట ప్రాంతంలో ఉంటూ ఎల్లయ్యగౌడ్‌ టవేరా కారును కిరాయిలకు నడుపుతున్నాడు. పెద్ద కూతురు అనూషకు అక్టోబర్‌ 17వ తేదీన ఘనంగా పెళ్లి చేశారు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తోంది. 

మూడో కూతురు సాయిప్రియ కోఠి ఉమెన్స్‌ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్, నాలుగో కూతు రు నందిని ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. కుమారుడు మురళీకృష్ణాగౌడ్‌ పదో తరగతి చదువుతున్నాడు. అక్క పెళ్లిలో వారంతా సంతోషంగా గడిపారు. సోమవారం ముగ్గురు కూతుళ్లను హైదరాబాద్‌కు పంపేందుకు తండ్రి దగ్గరుండి బస్సు ఎక్కించాడు. ‘సమయానికి మందులు వేసుకో.. అమ్మను ఏమనకు.. తమ్ముడికి రోజు స్కూల్‌కు వెళ్లమని చెప్పు’అంటూ కదులుతున్న బస్సులో నుంచి ఆ ముగ్గురు కూతుళ్లు తండ్రికి టాటా చెప్పి వెళ్లారు. బై డాడీ అని చెప్పిన పిల్లలను తిరిగి విగతజీవులుగా చూస్తాననుకోలేదని...బస్సు ఎక్కకపోతే నా ముగ్గురు కూతుళ్లు బతికే వారని ఆ తండ్రి గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. మృతదేహాలను చూసి వారి స్నేహితులు ఎక్కిఎక్కి ఏడ్చారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)