Breaking News

నేడు అసెంబ్లీలో కీలక బిల్లులు

Published on Mon, 03/17/2025 - 04:08

సాక్షి, హైదరాబాద్‌: మూడు కీలక బిల్లులు సోమవారం శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం రాత్రి విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీల వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు. 

బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన అనంతరం..దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధారి్మక, హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు. కాగా బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదించనుంది.  

నేడు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు
సోమవారం శాసనసభ, శాసనమండలి ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నాయి. విదేశీ విద్యానిధి పథకంతో పాటు ప్రభుత్వ జీవోలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ చార్జీల పెంపు, హెచ్‌ఎండీఏ భూముల తాకట్టు తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఇక మండలిలో కూడా సోమవారం కీలక ప్రశ్నలు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు, సీతారామ ప్రాజెక్టు, ఫార్మాసిటీ తదితర అంశాలపై ప్రశ్నలకు ప్రభుత్వం జవాబివ్వనుంది.  

నేడు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బ్రేక్‌ఫాస్ట్‌: చరిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ భేటీ కానున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి చాంబర్‌లో వారి కోసం బ్రేక్‌ఫాస్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)