Breaking News

తెలంగాణకు ముగ్గురు జడ్జీలు

Published on Wed, 05/28/2025 - 01:06

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోని 21 మంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. బదిలీలకు సిఫార్సు చేసిన వారిలో జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ కన్నెగంటి లలిత, జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత కూడా ఉన్నారు. జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ సుమలత మాతృ హైకోర్టు (పేరెంటల్‌ హైకోర్టు) తెలంగాణ కాగా, జస్టిస్‌ కన్నెగంటి లలిత తొలుత ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 

అనంతరం ఆమె కూడా తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తుండగానే పట్నాకు జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, కర్ణాటకకు జస్టిస్‌ లలిత, జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత బదిలీపై వెళ్లారు. ఇప్పుడు ఈ ముగ్గురు తెలంగాణ హైకోర్టుకు బదిలీ కానున్నారు. కాగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం హైకోర్టులో ఏసీజేతో కలిపి 29 మంది న్యాయమూర్తులున్నారు. 

ఒకరు బదిలీపై వెళ్లడం, ముగ్గురు న్యాయమూర్తుల రాకతో ఈ సంఖ్య 31కి చేరనుంది. ఇంకా 11 పోస్టులు ఖాళీ ఉండనున్నాయి. అలాగే, మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఇదిలా ఉండగా, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసినట్లు సమాచారం.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)