Breaking News

ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

Published on Fri, 09/19/2025 - 04:51

భూత్పూర్‌: ఓ ఆటోడ్రైవర్‌ నిర్లక్ష్యానికి ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలోని తుల్జాభవానితండా వద్ద ఈ ఘటన జరిగింది. భూత్పూర్‌ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్‌ నర్సింహులు గురువారం ఉదయం ముగ్గురు ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని భూత్పూర్‌ వస్తున్నాడు. అదే సమయంలో హన్వాడకు చెందిన ట్రాలీ ఆటోలో భూత్పూర్‌ నుంచి కొత్తమొల్గరకు కూల్‌డ్రింక్స్‌ తరలిస్తున్నారు. 

ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు తుల్జాభవానితండా వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఖిల్లాఘనపురం నుంచి వస్తున్న ఆటోలోని ప్రయాణికులు నర్సింహారెడ్డి (56), వంశీ (23), పాత్లావత్‌ సక్రి (34) అక్కడికక్కడే మృతిచెందగా.. ఆటో నడుపుతున్న డ్రైవర్‌ నర్సింహులు గాయపడ్డాడు. మరో ఆటోడ్రైవర్‌ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ నర్సింహులును అంబులెన్స్‌లో జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. 

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆటోడ్రైవర్‌ నర్సింహులు చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని ఆటోను నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాలీ ఆటోడ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. 

పెద్దల పండుగకు వచ్చి వెళ్తూ.. 
భూత్పూర్‌ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఖిల్లాఘనపురంలో ఉండే చెల్లెలు పెద్దల పండుగ చే యడంతో అక్కడికి వెళ్లాడు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో రో డ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 

కుమార్తెలను తీసుకురావడానికి వెళ్తూ.. 
ఖిల్లాఘనపురం మండలం దొంతికుంటతండాకు చెందిన పాత్లావత్‌ సక్రి.. జడ్చర్ల సమీపంలోని ఆశ్రమ పాఠశాల నుంచి తన ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  

కూలీ పనుల కోసం.. 
ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన వంశీ (23) కూలీ పనులకోసం ఆటోలో వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఖిల్లాఘనపురం ఆటో డ్రైవర్‌ నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌