Breaking News

తెలంగాణకు మూడు బుల్లెట్‌ రైళ్లు

Published on Sat, 06/20/2026 - 01:21

కందుకూరు: దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణకు మూడు బుల్లెట్‌ రైళ్లు(హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు) రానున్నా­యని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించిందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, బేగంపేట, తిమ్మాపూర్‌ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌­రెడ్డితో కలిసి సీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.87 కోట్లతో లింకు రహదారులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా లేమూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ హైస్పీడ్‌ కారిడార్ల కోసం మొదట రూ.5 లక్షల కోట్లు అంచనా వేయగా, భూముల ధరలు పెరగడంతో ఆ ఖర్చు రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని, దీనికి సంబంధించి సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఉత్తరం వైపు భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకా­శం ఉంద­న్నారు. శ్రీశైలం హైవే విస్తరణ పనులకు డీపీఆర్‌ సిద్ధమవుతోందని, ఏడాది లోపు పనులు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు.

రంగారెడ్డి జిల్లా తెలంగాణకు గుండెకాయ లాంటిదని, జిల్లాలోని గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధికి రహదారుల అనుసంధానం అత్యంత కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, తెలంగాణ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)