Breaking News

వాట్సాప్‌ కాల్‌లో 6 గంటలకు పైగా విచారణ

Published on Sun, 10/06/2024 - 03:08

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ పార్శిల్‌ పంపించారంటూ బాధితుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ సైబర్‌ నేరస్తులు వాట్సాప్‌ వీడియో కాల్‌లో 6 గంటల పాటు విచారణ చేశారు. కేటుగాళ్ల చేతికి చిక్కిన సికింద్రాబాద్‌కు చెందిన 62 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి రూ.24.58 లక్షలు మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్‌ నేరగాడు ఫెడెక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ అంటూ బాధితుడికి ఫోన్‌ చేసి పరిచయం చేసుకున్నాడు. 20 కిలోల మధుమేహం మందులతో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ మాదక ద్రవ్యాలతో కూడిన పార్శిల్‌ను కొరియర్‌ ద్వారా ఇరాన్‌లోని డాక్టర్‌ అర్మాన్‌ అలీకి పంపినట్లు తెలిపాడు. 

దీంతో బాధితుడు తాను అలాంటి పార్శిల్‌ ఏమీ పంపలేదని, ఆ డాక్డర్‌ ఎవరో కూడా తనకు తెలియదని బదులిచ్చాడు. ఇప్పటికే ఈ కొరియర్‌ లావాదేవీ గురించి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)కి సమాచారం అందించామని, దీంతో ఎన్‌సీబీ/ఎంయూఎం/2024–23/624 ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు. దీంతో ఎన్‌సీబీ అధికారుల వేషంలో మోసగాళ్లే బాధితుడిని వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా విచారించారు. కాస్త తెలివిగా వ్యవహరించి బాధితుడు వాట్సాప్‌ కాల్‌లో సంబంధిత అధికారుల గుర్తింపు కార్డులు, ఇతరత్రా ఆధారాలను కోరాడు. 

దీంతో మోసగాళ్లు నకిలీ ఐడీ కార్డులు, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పంపించారు. విచారణ సమయంలో వివిధ బ్యాంక్‌ల్లోని పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ)ల సమాచారాన్ని తెలపాలని బాధితుడిని ఒత్తిడి చేశారు. అకౌంట్లలోని రూ.24.58 లక్షల సొమ్మును ‘ఆర్‌బీఐ ఖాతా’కు బదిలీ చేయాలని, ధ్రువీకరణ తర్వాత 10 నిమిషాల్లో సొమ్ము తిరిగి పంపిస్తామని నమ్మించారు. లేకపోతే మాదక ద్రవ్యాల చట్టం కింద అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని, అరెస్టు చేయకుండా ఉండాలంటే ఎఫ్‌డీలోని సొమ్మును బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు మోసగాళ్లు సూచించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాకు సొమ్ము మొత్తాన్ని బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)