Breaking News

ఎంపీ డీకే అరుణ ఇంట చోరుడు.. మహా ముదురు

Published on Tue, 03/18/2025 - 09:34

హైదరాబాద్:  తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన అక్రమ్‌ అని, దేశ రాజధానిలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్‌ అయ్యాడని.. ఇప్పుడు హైదరాబాద్‌కు మకాం మార్చడాన్ని వెల్లడించారు.

వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్రమ్‌ మీద 2004 నుంచి ఇప్పటిదాకా 17 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పదే పదే పోలీసులకు దొరుకుతుండడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. గుడిమల్కాపూర్‌ ఏరియాలో రెండు రోజులు రెక్కీ  చేశాడు. చివరకు ఎంపీ డీకే అరుణ ఇంటి సమీపంలో చోరీ చేయాలనుకున్నాడు. అయితే.. 

దొంగతనానికి ఎంపీ ఇంటినే ఎంచుకున్నాడు. ఆ ఇంట్లోకి దూరి ఈజీగా చోరీ చేయొచ్చని భావించాడు. ఒకవేళ తేడాలొచ్చి దొరికినా.. వెనకాల ఉన్న రోడ్డు నుంచి పారిపోవచ్చని ప్లాన్‌ వేశాడు. ఎంపీ ఇంటి కిచెన్‌ కిటికీ గుండా లోపలికి ప్రవేశించిన అక్రమ్‌.. మాస్క్‌ వేసుకుని లోపలే గంటన్నరపాటు ఉండిపోయాడు. 

అక్రమ్‌ ధనవంతుల ఇళ్లు మాత్రమే టార్గెట్‌ చేస్తాడు.  నగదు మాత్రమే దొంగిలిస్తాడు. విలువైన వస్తువులు, నగల జోలికి పోడు. ఎందుకంటే.. అవి అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమని భావిస్తాడు’’ అని డీసీపీ విజయ్‌ వెల్లడించారు. ఇక..  వీఐపీ నివాస ప్రాంతాలతో పాటు నగరంలో పలు ఏరియాల్లో చోరీలు జరగడంపై ఆందోళన వ్యక్తం కావడం తెలిసిందే. అయితే.. ఇక నుంచి ఎలాంటి నేరాలు జరగకుండా పోలీస్ భద్రతను పెంచుతున్నాం అని పోలీసులు ప్రకటించారు. 

జరిగింది ఇదే..
డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్‌ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్‌ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. 

చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్‌ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్‌లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్‌ చేశాడు. అరుణ బెడ్‌రూమ్‌ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్‌ చేశాడు. గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్‌ లక్ష్మణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారామె. ఈ ఘటనను సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారామె.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)