Breaking News

‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్‌టెన్‌ వీరే

Published on Mon, 10/07/2024 - 04:24

గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాల వాటా సాధించిన టాప్‌టెన్‌ ఉద్యోగుల పేర్లను ప్రకటించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఈ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఎస్‌ఆర్‌పీ–1కు చెందిన ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌ ఆసం శ్రీనివాస్‌ రూ.3.24 లక్షలు అత్యధికంగా సాధించారు. 

మందమర్రి కేకే–5కు చెందిన జనరల్‌ మజ్దూర్‌ కుమ్మరి జెస్సీ రాజు రూ.3.10 లక్షలు, శ్రీరాంపూర్‌ ఆర్కే–5కు చెందిన ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌ అటికం శ్రీనివాస్‌ రూ.3.01 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ తుమ్మనపల్లి శ్రీనివాస్‌ రూ.3 లక్షలు, ఎస్‌ఆర్‌పీ–1కు చెందిన మేడం తిరుపతి రూ.3 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఫోర్‌మెన్‌ కర్నె వెంకటేశం రూ.2.96 లక్షలు, ఆర్కే–5కు చెందిన ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌ బండారి శ్రీనివాస్‌ రూ.2.92లు, ఆర్కే–7కు చెందిన కోల్‌కట్టర్‌ దుర్గం తిరుపతి రూ.2.91 లక్షలు, ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనికి చెందిన ఓవర్‌మెన్‌ వి.వంశీకృష్ణ రూ.2.89 లక్షలు, శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే–6కు చెందిన సర్వేయర్‌ బర్ల మహేందర్‌ రూ.2.88 లక్షలు సాధించారు. 

వీరిని సింగరేణి యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రత్యేకంగా అభినందించాయి. వీరికి సోమవారం సీఅండ్‌ఎండీ కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నట్లు యూనియన్‌ నాయకులు వెల్లడించారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)