Breaking News

ఎమ్మెల్యేల కేసులో స్పీడ్‌ పెంచిన సీబీఐ.. సర్కార్‌ ప్లాన్‌ ఏంటి?

Published on Thu, 02/09/2023 - 10:39

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్నాయి. చివరకు ఈ కేసును హైకోర్టు.. సీబీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసులో సీబీఐ స్పీడ్‌ పెంచింది. ఈ కేసులో​ ప్రభుత్వం తమకు సహకరించకపోతే ఏం చేయాలో ప్లాన్‌ చేస్తోంది. 

ఇందులో భాగంగానే ప్రభుత్వం కేసు వివరాలు ఇవ్వకపోతే సీబీఐ ఇలా చేసే అవకాశం ఉంది. 91 సీఆర్‌పీసీ కింద ప్రభుత్వానికి సీబీఐ నోటీసులు ఇవ్వనుంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 93 ప్రకారం.. కోర్టు వారెంట్‌ ద్వారా సీబీఐ డాక్యుమెంట్లను సీజ్‌ చేయనుంది. లేదంటే హైకోర్టులో పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. మరోవైపు.. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ మరోసారి లేఖ రాయనుంది. కాగా, ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది.  

అయితే, ఈ లేఖల్లో మొయినాబాద్‌ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు తమకు సమర్పించాలని సీబీఐ కోరింది. కాగా, ఈ లేఖపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదిలా ఉండగా.. ఈ కేసు విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)