Breaking News

ఓటును మించిన ఆయుధం లేదు 

Published on Thu, 04/11/2024 - 04:27

గచ్చిబౌలి (హైదరాబాద్‌):  బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ,  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ  ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్‌’ యాప్‌ను మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారు. కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్‌ తెలిపారు. 

బ్యాలెట్‌ పవర్‌ గొప్పది: రోనాల్డ్‌రాస్‌ 
బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ పవర్‌ చాలా గొప్పదని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్‌లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్‌ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్‌–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్‌ రోడ్‌లోని మెటల్‌ చార్మినార్‌ వరకు రన్‌ కొనసాగింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)