‘పంచాయతీ’ నిబంధనలెన్నో..

Published on Sat, 11/29/2025 - 04:00

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లకూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. సర్పంచ్‌ అభ్యర్థి నియమించుకునే పోలింగ్‌ ఏజెంట్లు సంబంధిత గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఓటరుగా నమోదై ఉండాలి. ఓటరు ఫొటో గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఏదైనా ఇతర గుర్తింపు డాక్యుమెంట్‌ కలిగి ఉండాలి. దీనివల్ల పోలింగ్‌ స్టేషన్‌లో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) భావిస్తోంది. 

లెక్కలు చెప్పాల్సిందే.. 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ రోజువారి ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు తప్పనిసరిగా చూపించాలి. గతంలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఎప్పుడో గానీ తెలియజేస్తూ ఉండేవారు. కానీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు సమర్పించాలి. ఎవరూ ప్రచార ఖర్చు వివరాలు కోరితే వారికి వాటిని అందించాలని ఎస్‌ఈసీ సూచించింది. 

తద్వారా అభ్యర్థులు చేసే ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు తెలియడంతోపాటు, పెరిగే ఎన్నికల ఖర్చును నియంత్రించేందుకు అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసేవారు చేస్తున్న ప్రచార, ఇతరత్రా వ్యయం వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నారు.  

అభ్యర్థుల వ్యయంలో మార్పు లేదు  
నూతన పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం ఎన్నికల ఖర్చు పరిమితిని ఐదువేల జనాభా దాటిన గ్రామాల సర్పంచ్‌ అభ్యర్థులకు రూ.రెండున్నర లక్షలు, ఐదువేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.లక్షన్నర పరిమితికి పెంచారు. ఐదువేల పైబడిన జనాభా ఉన్న పంచాయతీల్లోని వార్డుల అభ్యర్థులకు రూ.యాభైవేలు, ఐదువేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లోని వార్డు అభ్యర్థులకు రూ.30 వేల వ్యయ పరిమితిని ఎస్‌ఈసీ ఖరారు చేసింది. 

గత ఎన్నికల్లోనూ (2019 జనవరిలో) అభ్యర్థులకు ఇంతే పరిమితి ఉంది. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగినా కూడా పాత పరిమితినే కొనసాగిస్తుండడం పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  
» ఎన్నికలకు సంబంధించిన న్యాయ పరమైన నిబంధనలు ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవాలి 
» నిర్దేశిత (నమూనా–3ధ్రు) పత్రం ప్రకారం నామినేషన్‌ ఉందా లేదా అభ్యర్థి, ప్రపోజర్ల సంతకాలున్నాయా లేదా చూసుకోవాలి 
» అభ్యర్థి సంతకం చేసిన స్వయం ధ్రువీకరణ పత్రం మరో ఇద్దరి సంతకాలతో ధ్రువీకరణ అయ్యిందో లేదో సరి చూసుకోవాలి 
» నామినేషన్‌ పత్రాన్ని అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్‌ ద్వారానే సమరి్పంచాలి
» నిర్ణీత పద్ధతి ప్రకారం ఎన్నికల ఏజెంట్‌ను నియమించుకోవాలి
» నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయ్యే ఎన్నికల వ్యయాన్ని ఎస్‌ఈసీ నిర్దేశిత నమూనాలో సరైన పద్ధతిలో నిర్వహించాలి.

బ్యాంక్‌ ఖాతా తెరవాల్సిందే... 
ఎన్నికల్లో చేసే ఖర్చు నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి, నామినేషన్‌ దాఖలు సమయంలో సంబంధిత రిటరి్నంగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థి ఈ బ్యాంక్‌ ఖాతా వివరాలు తప్పకుండా తెలియజేయాలి. ఈ బ్యాంక్‌ ఖాతా నుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చుచేయాలి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)