Breaking News

రెండు బీర్లు.. ఒక క్వార్టర్‌

Published on Fri, 03/28/2025 - 04:46

శంకరపట్నం: మద్యం దుకాణంలో రోజుకు రూ.లక్షల్లో గిరాకీ.. కౌంటర్లో డబ్బు బాగానే ఉంటుందని భావించిన ఓ దొంగ.. దుకాణం మూశాక చోరీకి దిగాలని భావించాడు. అర్ధరాత్రి వచ్చి కష్టపడి పైకప్పు రేకు కోసి, లోపలికి దిగాడు. ఆశగా కౌంటర్‌ తెరిస్తే రూపాయి కూడా లేకపోవడంతో నిరాశ చెందాడు. ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకని ఒక క్వార్టర్, రెండు బీర్లను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. 

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌ క్రాస్‌రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనపై వైన్స్‌ యజమాని, పోలీసుల కథనం ప్రకారం.. మొలంగూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించారు. సమయం ముగిశాక సిబ్బంది కౌంటర్‌లోని డబ్బులు తీసుకుని వైన్స్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ దుకాణం పైకప్పు రేకులను కోసి దుకాణంలోకి చొరబడ్డాడు. 

కౌంటర్‌లో డబ్బు లేకపోవడంతో రెండు బీర్లు, క్వార్టర్‌ సీసా, సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్‌ తీసుకెళ్లాడు. గురువారం వైన్స్‌ తెరవగా.. పైకప్పు కోసి ఉండడాన్ని గమనించి వ్యాపారి శ్రీనివాస్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ రవి, క్లూస్‌టీం వివరాలు సేకరించారు. ఈ వైన్స్‌లో గతంలోనూ దొంగలు పైకప్పు తొలగించి చోరీకి దిగారని, దీంతో ఇనుపరాడ్లు వేశానని, అయినా రేకు కోసి దొంగ లోపలకు దిగాడని యజమాని వాపోయాడు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)