Breaking News

ఆర్టీసీ ఎండీగా చివరి రోజు.. సజ్జనార్‌ ఏం చేశారంటే?

Published on Mon, 09/29/2025 - 13:26

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌(VC Sajjanar) తన చివరి రోజున విధుల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ, ప్రజా రవాణాపై తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. సామాన్యుడిలా ఆర్టీసీ(TGSRTC) బస్సులో ప్రయాణించారు. బస్సులో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రయాణం చేశారు. ఈ క్రమంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా యూపీఐ పేమెంట్‌ చేసి టికెట్‌ తీసుకున్నారు.

ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ సోమవారం ఉదయం సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్‌లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్ వరకు 113 I/M రూట్ సిటీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీలో రవాణా సదుపాయాలపై ఆరా తీశారు. ప్రయాణికులతో ముచ్చటించి.. సౌకర్యాలపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను టీజీఎస్‌ఆర్టీసీ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసింది.

ఇక, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సజ్జనార్‌ హైదరాబాద్‌ సీపీగా బదిలీ అయ్యారు. అక్టోబర్ ఒకటో తేదీన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)