Breaking News

కాసుల కోసమే పాస్‌ల ధర పెంపు!

Published on Wed, 06/11/2025 - 08:07

సాక్షి, హైదరాబాద్‌: మహిళల ఉచిత ప్రయాణం ఆర్టీసీకి  సవాల్‌గా మారుతోంది. నగదు నిల్వలు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తోంది. తాజాగా విద్యార్థులు, ఎన్జీవోలు ఎక్కువగా వినియోగించే బస్‌పాస్‌లను సైతం వదిలిపెట్టకుండా ఉన్నఫలంగా చార్జీలను పెంచేశారు. ఏ రోజుకారోజు బస్సుల నిర్వహణ, విడిభాగాల కొనుగోళ్లు, తదితర ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడం వల్లనే బస్‌పాస్‌ల ధరలను పెంచవలసి వచి్చందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అన్ని రకాల పాస్‌లపైన 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. 

నగరంలో ప్రస్తుతం రోజుకు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వారిలో 17 లక్షల మందికి పైగా మహిళలే. వీరి చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ ఈ నిధులు సకాలంలో  లభించడం లేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం వివిధ మార్గాలను అన్వేíÙస్తున్నారు. పెంచిన బస్‌పాస్‌ ధరల వల్ల  ప్రతి నెలా రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకం కింద అన్ని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళలతోనే ఇవి కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా పురుషుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

 ఈ ప్రయాణికులను పెంచేందుకు అధికారులు  కండక్టర్‌లపైన ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి బస్సుకు నగదు టార్గెట్‌లు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులను సైతం వదిలిపెట్టకుండా అడ్డగోలుగా బస్‌పాస్‌ ధరలను  పెంచడం గమనార్హం. సాధారణ నెలవారీ పాస్‌ను ఏకంగా రూ.400 నుంచి  రూ.600లకు పెంచారు. ఈ పాస్‌ తీసుకున్న విద్యార్థులు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలి. మెట్రోల్లో ప్రయాణం చేయాలంటే అదనంగా చెల్లించవలసిందే. అందుకోసం స్పెషల్‌ పాస్‌లను ప్రవేశపెట్టారు.

పురుష ప్రయాణికులు 6 లక్షలే... 
ఒకప్పుడు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌జోన్‌లో ఉచిత ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సాంకేతికంగా ఆక్యుపెన్సీ కూడా  పెరిగింది. కానీ అదే సమయంలో పురుషుల సంఖ్య 6 లక్షలకు తగ్గింది. గతంలో సుమారు  18 లక్షల మంది మగవాళ్లు ఉంటే  15 లక్షల మంది మహిళలు ఉండేవారు. బస్సుల్లో సీట్లు లభించకపోవడం, మహిళలతోనే నిండిపోవడంతో చాలామంది  వ్యక్తిగత వాహనాలను, మెట్రోరైళ్లను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ‘ఈ 6 లక్షల మంది చెల్లించే టిక్కెట్‌ చార్జీలు రూ.2.5 కోట్ల వరకు ఉంటాయి. 

కానీ ఇటీవల పెరిగిన విడిభాగాల ధరలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చుల దృష్ట్యా రోజుకు రూ.3 కోట్ల వరకు భారం పడుతుంది.’ అని ఒక అధికారి  తెలిపారు. ‘ కొన్ని రకాల విడిభాగాలు ఎప్పటికప్పుడు డిపోస్థాయిలోనే కొనుగోలు చేయవలసి ఉంటుంది. వాటికోసం  బస్‌భవన్‌పైన ఆధారపడలేం కదా..’ అని పేర్కొన్నారు. పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఇటీవల 200 మెట్రో డీలక్స్‌ బస్సులను ప్రవేశపెట్టారు. కానీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల కంటే మెట్రోడీలక్స్‌ చార్జీలు చాలా ఎక్కువగా ఉండడంతో  ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

విద్యార్థి పాస్‌ల కోసం విస్తృత ఏర్పాట్లు.... 
స్టూడెంట్‌ బస్‌పాస్‌ల కోసం ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. విద్యార్థులు టీజీఎస్‌ఆరీ్టసీ వెబ్‌సైట్‌లో (https://tgsrtcpass.com)  ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విద్యాసంస్థల ప్రిన్సిపాళ్ల ఆమోదంతో ఈ దరఖాస్తులు  ఆర్టీసీకి చేరుతాయి.

ఈ నెల 12వ తేదీ నుంచి నగరంలోని అన్ని బస్‌పాస్‌ కేంద్రాల నుంచివిద్యార్థులు తమ పాస్‌లను తీసుకోవచ్చు. 

ఆరాంఘర్, ఆఫ్జల్‌గంజ్, బాలానగర్, బోరబండ, సీబీఎస్, చార్మినార్, దిల్‌సుఖ్‌నగర్, ఈసీఐఎల్, ఫరూఖ్‌నగర్, ఘట్కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, కాచిగూడ, కోఠి బస్‌టెరి్మనల్, కేపీహెచ్‌బీ, లక్డీకాఫNల్, ఎల్బీనగర్, లింగంపల్లి, లోతుకుంట, మేడ్చల్, మెహదీపట్నం, మిధాని, మొయినాబాద్, ఎన్జీవో కాలనీ, శంషాబాద్, ఉప్పల్‌ తదితర బస్‌పాస్‌ కేంద్రాల నుంచి తీసుకోవచ్చు.


 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)