Breaking News

10 మంది టీజీఎస్పీ సిబ్బంది డిస్మిస్‌

Published on Mon, 10/28/2024 - 05:14

సాక్షి, హైదరాబాద్‌:  సెలవుల్లో మార్పులు, ఇతర డిమాండ్లతో ఆందోళనలు చేపట్టిన తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్‌ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 

పోలీస్‌ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించడం, ఆందోళనలను రెచ్చగొట్టడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తూ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంటూ డీజీపీ కార్యాలయం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉద్వాసనకు గురైన సిబ్బంది వీరే..: 3వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ జి.రవికుమార్‌.. 6వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ కె.భూషణ్‌రావు.. 12వ బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుల్‌ ఎస్‌కే షరీఫ్‌.. 17వ బెటాలియన్‌ ఏఆర్‌ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్‌.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్‌.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)