TGPSC: గ్రూప్‌-3 పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Published on Sun, 11/17/2024 - 07:11

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నేడు, రేపు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ఇక, పరీక్ష 10 గంటలకు ప్రారంభం కావడంతో.. పలుచోట్ల పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో వారిని పరీక్షా కేంద్రాలకు అధికారులు అనుమతించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు అభ్యర్థులను పరీక్ష కేంద్రాన్ని అనుమతించని అధికారులు. తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఆనంద్, వేములవాడ పట్టణానికి చెందిన మంజుల అనే ఇద్దరు అభ్యర్థులకు ఎంట్రీ నిరాకరణ. పరిగెత్తుకుంటూ పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు అభ్యర్థులు.

ఇక, సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 15 మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. వికారాబాద్ జిల్లాలో 15 మంది.. అలాగే, ఆదిలాబాద్‌ జిల్లాలో 20 మందికి ఆలస్యం కావడంతో వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. అధికారులను ఎంత బ్రతిమిలాడినా వారిని పరీక్షా కేంద్రాల్లోకి పంపించలేదు. 

ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–1.. అలాగే, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష నిర్వహిస్తారు. 18న(రేపు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–3 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)