Breaking News

జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసు.. ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు

Published on Wed, 08/21/2024 - 15:40

సాక్షి,హైదరాబాద్‌: జన్వాడ ఫామ్‌హౌజ్‌ కూల్చివేత కేసులో హైదరాబాద్‌ డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్‌హౌజ్‌ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది. 

ఫామ్‌హౌజ్‌ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. 

కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా  పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది.  హైడ్రా అధికారాలు ఏంటని పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది. 

హైడ్రా జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అవుటర్‌ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్‌) పరిధిలో చెరువులు, కుంటలను కాపాడటమే హైడ్రా విధి అని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైడ్రా న్యాయవాది విచారణకు రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఫామ్ హౌస్ నిర్మాణ అనుమతులపై హైకోర్టు ప్రశ్నలు..
గ్రామపంచాయతీ సర్పంచ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడని జన్వాడ ఫామ్‌హౌజ్‌ తరపున పిటిషన్‌ వేసిన వ్యక్తి తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సర్పంచ్‌కు ఎలాంటి అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. గ్రామపంచాయతీ సెక్రటరీకి మాత్రమే  అనుమతులు ఇచ్చే అధికారం  ఉందని, సర్పంచ్‌కు లేదని పేర్కొంది. 

హైడ్రా కు హైకోర్టు కీలక ఆదేశాలు

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)