Breaking News

TSLPRB Recruitment 2026: తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Published on Wed, 07/29/2026 - 19:55

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది.

విభాగాలవారీగా ఖాళీల వివరాలు
పోలీస్ శాఖ (Police Department)
•   పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 
•   పోలీస్ కానిస్టేబుల్ (AR): 1,052 
•   సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 
•   అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB): 23 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR): 14 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP): 12 
•   పోలీస్ కానిస్టేబుల్‌ (SARCPL): 24 
•   పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ - PTO): 20 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL): 3 
•   పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ - PTO): 7 


స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)
•    కానిస్టేబుల్: 1,380
•    సబ్ ఇన్‌స్పెక్టర్: 44


అగ్నిమాపక, విపత్తు నిర్వహణ & సివిల్ డిఫెన్స్ శాఖ
•    ఫైర్ ఫైటర్: 751
•    స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39


4. జైళ్లు & సరిదిద్దే సేవల శాఖ (Prisons & Correctional Services)
•    వార్డర్ (పురుషులు): 196
•    డిప్యూటీ జైలర్ (పురుషులు): 14
•    వార్డర్ (మహిళలు): 12
•    డిప్యూటీ జైలర్ (మహిళలు): 1


ముఖ్యమైన సమాచారం & దరఖాస్తు విధానం
•   ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించే ఖచ్చితమైన తేదీలను త్వరలో మరో ప్రకటన ద్వారా వెల్లడించనున్నారు.
•  అధికారిక వెబ్‌సైట్: అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
•    వైద్య పరీక్షల సూచన: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే, తమ శారీరక, వైద్య ప్రమాణాలు (Physical and Medical Standards) సరిగ్గా సరిపోతున్నాయో లేదో సివిల్ సర్జన్ తో పరీక్షించుకోవాలని బోర్డు సూచించింది.
సిద్ధంగా ఉంచుకోవాల్సిన ధ్రువపత్రాలు:
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో, నియామక ప్రక్రియలో భాగంగా క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:
•    ఎస్సీ కుల ధ్రువపత్రం: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్-I, ఎస్సీ గ్రూప్-II, ఎస్సీ గ్రూప్-III సబ్-క్లాసిఫికేషన్‌తో కూడిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
•    ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్: తెలంగాణ ప్రభుత్వంచే ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేయబడిన EWS సర్టిఫికేట్.
•    నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్: బీసీ అభ్యర్థుల కోసం ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్.
•    స్థానికత ధ్రువపత్రాలు: 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్లు.
•    ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు (వర్తించే అభ్యర్థులకు).

 

 

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)