Breaking News

కమిషనర్లు లేక..సమాచారం రాక..

Published on Sun, 09/15/2024 - 05:11

‘రాష్ట్ర సమాచార కమిషన్‌లో ఒక్కరంటే ఒక్క కమిషనర్‌ కూడా లేరా? ఒక్క కమిషనర్‌ కూడా లేకుంటే అప్పీళ్లను సిబ్బంది విచారిస్తారా? ఇలాగైతే సమాచార హక్కు చట్టం చేసి ఏం ప్రయోజనం? కౌంటర్లు అక్కర్లేదు..ఎప్పుడు నియమిస్తారో చెప్పండి?’  – పిల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం  

‘ప్రధాన సమాచార కమిషనర్‌ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్‌ పోస్టుల కోసం 273 దరఖాస్తులొచ్చాయి. త్వరలో సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తాం. దీని కోసం నాలుగు వారాల గడువు ఇవ్వాలి’  – 2023 ఆగస్టులో హైకోర్టుకు సర్కారు నివేదన

సాక్షి, హైదరాబాద్‌: అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసురావడా­నికి కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన సమాచారహక్కు చట్టం కమిషనర్లు లేక నిర్వీర్యమవుతోంది. ప్రధాన సమాచార కమిషనర్‌ 2020, ఆగస్టు 24న, చివరి సమాచార కమిషనర్‌ 2023, ఫిబ్రవరి 24న తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి నియామకమూ జరగలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అడిగినా సకాలంలో ఇచ్చే వారు కరువయ్యారు. దీనిపై కమిషన్‌ను సంప్రదించడానికి.. జిల్లా కమిటీలూ సరిగా లేవు. ఇక అప్పీలు చేద్దామంటే రాష్ట్రస్థాయిలో కమిషనే లేదు. 

ఈ ఏడాది జూన్‌ 12న ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చి.. జూన్‌ 29వ తేదీని ఆఖరు తేదీగా ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా.. ఇప్పటివరకూ దరఖాస్తుల పరిశీలనే జరగలేదు .

రాష్ట్ర కమిషన్‌.. 
సెక్షన్‌ 15(1) కింద ఈ కమిషన్‌ ఏర్పాటవుతుంది. దీనికి ఓ ప్రధాన కమిషనర్‌తో పాటు గరిష్టంగా 10 కమిషనర్ల వరకు నియమించవచ్చు. ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా శాసనసభలో ప్రతిపక్ష నేత, ఓ కేబినెట్‌ మంత్రి సభ్యులుగా ఉండే కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్‌ వీరిని నియమిస్తారు. కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది.  
» ప్రజాజీవనంలో సుప్రసిద్ధులే ఉండాలి. విశాలమైన విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, జర్నలిజం, ప్రసా­ర మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవమున్నవారు ప్రధాన కమిషనర్, కమిషనర్‌గా అర్హులు. 
»    ప్రధాన కమిషనర్, కమిషనర్లు నియామ­కమైన నాటి నుంచి ఐదేళ్లు లేదా వయసు 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరిని తిరిగి నియమించడానికి అవకాశం లేదు. కమిషనర్లకు ప్రధాన కమిషనర్‌గా నియామకం పొందే అర్హత ఉంటుంది. అయితే మొత్తంగా ఐదేళ్లు మించి బాధ్యతల్లో కొనసాగడానికి వీలులేదు. 
»  వీరిని తొలగించడం గవర్నర్‌ ఉత్తర్వు ద్వారా మాత్రమే సాధ్యం. 

అధికారాలు.. 
సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి 
»వ్యక్తులకు సమన్లు జారీ చేసి హాజరయ్యేట్టు లేదా లిఖిత పూర్వకంగా సాక్ష్యం ఇచ్చేట్టు చేయడం 
» అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలించడం, తనిఖీ చేయడం  
» అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలం స్వీకరించడం 
» కోర్టు లేదా ప్రభుత్వ కార్యా లయం నుంచి రికార్డులు, కాపీలు తెప్పించడం 
» ఏపీఐసీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌ 
» 2017, సెప్టెంబర్‌ 9 నుంచి తెలంగాణ కమిషన్‌ ప్రారంభం. గణాంకాలు ఆ తేదీ నుంచే.  
 »2024 అప్పీళ్లు, ఫిర్యాదుల గణాంకాలు ఆగస్టు 24 వరకు..  
» 17,792 ఫిర్యాదుల్లో ఒకసారి కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినా సమస్య పరిష్కారం కాలేదంటూ మళ్లీ వచి్చన కేసులు 3,210 

ఎవరు అప్పీల్‌ చేయవచ్చు 
»    సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారి నిరాకరించినప్పుడు.. 
»    నిర్దేశించిన 30 రోజుల్లో సమాచారం రాకపోయినా.. 
»   సమాచారం కోసం చెల్లించాల్సిన రుసుము సహేతుకంగా లేదని అనిపిస్తే..  
»    ఒకవేళ అధికారి తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చారని భావిస్తే..  
»   తగిన కారణాలుంటే కమిషన్‌ నేరుగా విచారణకు కూడా స్వీకరించవచ్చు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)