Breaking News

రణరంగమైన ఛైర్మన్ ఎన్నిక.. వివేక్‌ కారుపై రాళ్లదాడి

Published on Tue, 02/17/2026 - 11:05

సాక్షి, మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక సందర్బంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి వివేక్‌ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయిపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్పగాయాలయినట్లు తెలుస్తోంది.

ఎన్నికల కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పెద్దఎత్తున గూమిగూడారు. అనంతరం పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం అక్కడ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. సరైన మోజారిటీ ఉన్నా ఛైర్మన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారంటూ ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలంటూ నిరనస చేపట్టారు. నిన్న11 చోట్ల కోరం సరిగ్గా లేకపోవడంతో వాయిదాపడిన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నికలను అధికారులు నేడు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పలు చోట్ల 144 సెక్షన్ విధించారు.

     కుమ్రం భీం ఆసిఫాబాద్

  •  కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్ కాంగ్రెస్ కైవసం 
  •  ఛైర్‌పర్సన్‌ షాహిన్ సుల్లానా (కాంగ్రెస్)
     వైస్‌ ఛైర్‌పర్సన్ లావణ్య (బీజేపీ)
     

      సంగారెడ్డి జిల్లా

  • జహీరాబాద్ కాంగ్రెస్ కైవసం 
  • మున్సిపల్ ఛైర్మన్‌గా యూనస్ 

    వైస్‌ఛైర్మన్‌గా శిరీష

    మహబూబాబాద్ జిల్లా

  • తొర్రూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
  • లక్కీడ్రాలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి

       జనగామ జిల్లా

  • జనగామ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం
  • లక్కీడ్రాలో కాంగ్రెస్ సొంతం
  • ఇండిపెండెంట్లను ప్రభావితం చేశారని పల్లా ఆగ్రహం
  • కౌన్సిల్‌ హాల్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన 
    కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన అదృష్టం
  • జనగామ మున్సిపల్ ఎన్నికపై ఉత్కంఠ
  • కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌కు సమానంగా ఓట్లు
  • దీంతో లక్కీడ్రా ద్వారా చైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నిక 
  • దీంతో ఇండిపెండెంట్లను ప్రభావితం చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహాం

సంగారెడ్డి జిల్లా

  • ఇంద్రేశ్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం 
  • ఛైర్‌పర్సన్‌గా ప్రమీల,వైస్‌ఛైర్మన్‌గా హరీశ్ రెడ్డి 
  • స్వతంత్ర్య ‍అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ గెలుపు
  • పటాన్‌చెరు మున్సిపాలిటీల్లో ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశం
  • ఐదింట ఐదు గెలిచి క్లీన్‌స్వీప్ చైసిన బీఆర్ఎస్ 
     

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)