Breaking News

దొరా.. మా భూములు లాక్కోవద్దు

Published on Sat, 10/26/2024 - 05:43

కొడంగల్, దుద్యాల్‌: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్‌ జిల్లా దుద్యాల్‌ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్‌ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది. 

ఏం జరిగిందంటే.. 
కాంగ్రెస్‌ పార్టీ దుద్యాల్‌ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్‌ హైదరాబాద్‌ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్‌ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్‌ లైట్‌ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్‌ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.

ఫార్మా వద్దు.. పరిహారం వద్దు
ఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)